*బొమ్మరం ఎక్స్ రోడ్ చౌరస్తా దగ్గర టిఫిన్ సెంటర్ ఇరువైపులా వాహనాలు ఆపడంతో యాక్సిడెంట్….
*ప్రాణాలు పోతున్న జిఎంఆర్ అధికారులకు పట్టింపు లేదు…
A9 న్యూస్ మాసాయిపేట ప్రతినిధి, డిసెంబర్ 17:
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలం శివారులో స్టేషన్ మాసాయిపేట బొమ్మరం జాతీయ రహదారి ఎన్ హెచ్ 44 హైవేపై ఎక్స్ రోడ్డు చౌరస్తా దగ్గర టిఫిన్ చేయడానికి అధిక సంఖ్యలో బండ్లు ఆగడం వల్ల ఎన్నిసార్లు జిఎంఆర్ సమస్త కు విన్నవించిన రోడ్డు ప్రక్కన ఉన్న టిఫిన్ సెంటర్లను పట్టించుకోవడంలేదని అధికారులకు తెలిపిన గాని వారి దగ్గర నెలసరి కమిషన్లు తీసుకొని మూడు పువ్వులు ఆరు కాయలు లాగా జిఎంఆర్ అధికారులు పట్టించుకోవడం లేదు అదేవిధంగా ఎందరో ప్రాణాలు బొమ్మరం ఎక్స్ రోడ్ చౌరస్తా దగ్గర పోయిన సంఘటనలు ఉన్నాయి అనంతరం గాయాలతో బ్రతికి బయట పడిన సందర్భాలు ఉన్నాయి అని అంటున్నారు ఇప్పుడు టిఫిన్ చేయడానికి ఇరువైపులా వాహనాలు ఆపడంతో ద్విచక్ర వాహనదారులు యాక్సిడెంట్ కావడంతో అధికంగా గాయాలు కావడంతో రోడ్లపై చెల్లాచెదురుగా పడి ఉన్నారు. ఇప్పటికైనా జిఎంఆర్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.