రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కేశంపేట్ ముఖ్య కుడులైన బైపాస్ దగ్గర్ గల లక్కీ వైన్స్ లో అర్థరాత్రి దొంగలు పడ్డారు. వైన్స్ యజమాని కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం రాత్రి సుమారు 12 గంటలు సమయంలో వైన్ షాప్ వెనుక నుండి డోర్ ని గడ్డపారతో పగలగొట్టి లోపలికి వచ్చారు అని తెలిపారు.పగలగొట్టిన గడ్డపారను అక్కడే వదిలేసి వెళ్లారు. దొంగలు దొంగలించిన మొత్తం 5000 రూపాయలు,మందును దొంగలించారని దాని విలువ 20వేల రూపాయలు ఉంటుంది అన్నారు. సిసి నిఘా నేత్రాలు ఉన్నప్పటికీను సీసీ నిఘా నేత్రాలను మరియు డివిఆర్ లో ఉండే హార్డ్ డిస్క్ తో సహా ఎత్తుకెళ్లారు.