*ఆశ వర్కర్లకు సంఘీభావం తెలిపిన బిఆర్ఎస్ నాయకులు* *ఇచ్చిన హామీలు అమలు చేయమంటే అక్రమ అరెస్టుల* *బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశంకుమార్* ఇందల్వాయి మంగళవారం.
ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగినందుకు ఆశ వర్కర్లను హైదరాబాదులో పోలీసులు పిడుగులు గుద్దడమే కాకుండా అక్రమంగా నిర్బంధించారని ప్రభుత్వం తీరుపై బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు పాశంకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అరెస్టు చేసిన ఆశ వర్కర్లకు బి ఆర్ ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఫాసిస్టు ప్రభుత్వం ఏలుతుందని వారు అన్నారు. ఎన్నికల ముందు ఆశ వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెలకు 18000 వేతనం ఇస్తామని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం మర్చిపోయారా అని ఆయన అన్నారు ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు . లేనియెడల ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని ఆయన హెచ్చరించారు. సంఘీభావం తెలిపిన వారిలో ఇందల్వాయి మాజీ ఎంపీపీ రమేష్ నాయక్ చింతల దాసు మారంపల్లి సుధాకర్ బీరీష్ తదితరులు ఉన్నారు