A9 న్యూస్ ప్రతినిధి ఇండల్వాయి:
దివాలకు ప్రతిరూపం కాంగ్రెస్ తల్లి.. తెలంగాణ తల్లి విగ్రహా రూపాన్ని మార్చిన సీఎంకు ప్రజలే బుద్ధి చెప్తారు…. మాజీ ఎంపీపీ బాదావత్ రమేష్ నాయక్ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజల తలరాతలు మారాలి కానీ తల్లుల విగ్రహాలు మార్చడం కాదని ఇందల్వాయి మాజీ ఎంపీపీ రమేష్ నాయక్ ప్రభుత్వ తీరును ఎండ కట్టారు. నిజాంబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లో సీఎం రేవంత్ తీరుపై వెల్లువెత్తిన నిరసనలు మండల హెడ్ కోటర్ లో తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకలు చేశారు మండల కేంద్రంలోని మాజీ ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి పాలాభిషేకం చేశారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న ఇప్పటికి ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు హామీలు కూడా నెరవేర్చకపోవడం సిగ్గుచేటు అన్నారు. హామీలు నెరవేర్చకుండా విగ్రహాలు మాత్రం పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ పెద్దల మెప్పుకోసం సీఎం రేవంత్ ఆడుతున్న నాటకమేనని ఆయన దుయా పట్టారు ఇప్పటికైనా ప్రభుత్వ తీరు మారకపోతే టిఆర్ఎస్ పార్టీ అడుగడుగునా నిలదీయక తప్పదని ఆయన హెచ్చరించారు పాలాభిషేకం చేసిన వారిలో. బి ఆర్ ఎస్. రాష్ట్ర నాయకులు పాశంకుమార్ మాజీ ఎంపిటిసిలు మారంపల్లి సుధాకర్ చింతల దాస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు బిరీష్. నాయకులు నాగేష్ రమేష్ మాజీ వైస్ ఎంపీపీ అంజయ్య మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు