A9 న్యూస్ ప్రతినిధి ఇందల్ వాయి:
ఇందల్ వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించబోయే క్రీడ పోటీలకు క్రీడాకారులు ముందుకు రావాలని ఎంపీడీవో లక్ష్మారెడ్డి, తహసిల్దార్ వెంకట్రావు, ఎస్సై మనోజ్ కుమార్ పర్యవేక్షణలో క్రీడ పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్రీడ పోటీలకు ఇదే ఆహ్వానంగా ప్రజాప్రతినిధులకు, మండల విద్యాశాఖ అధికారి, కాంప్లెక్స్ హెడ్మాస్టర్, హెడ్మాస్టర్ లందరికీ, వీడిసి సభ్యులకు అధ్యక్ష కార్యదర్శులకు సభ్యులకు. తాజా మాజీ యువజన సంఘాల నాయకులకు, గ్రామ పెద్దలకు, యువకులకు, క్రీడాకారులకు తెలియపరచడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందల్వాయి ప్రజా పరిషత్, పాఠశాలలో మంగళవారం, బుధవారం రోజున సీఎం కప్ క్రీడలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి క్రీడ పోటీలను గ్రామస్తులు క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు.
మొదటి బహుమతి కబడ్డీ(ఓపెన్ టు ఆల్ ), రెండవ బహుమతి, మరియు కోకో (ఓపెన్ టు ఆల్) మూడవ బహుమతి వాలీబాల్ (1-1-2007 తర్వాత జన్మించిన వారు)
ఈ క్రీడలలో పాల్గొనే సీనియర్ క్రీడాకారులు ఎవరైనా ఉంటే క్రీడలలో పాల్గొనేవారు పంచాయతీ కార్యదర్శి భరత్, భూపతి రాజేశ్వర్ పిడి, గార్లను సంప్రదించ వలసిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ లక్ష్మీనాథం, పిడి భూపతి రాజేశ్వర్లు గ్రామ కమిటీ చైర్మన్ జితేందర్ ఉన్నారు.