వెల్మల్ గ్రామ అభివృద్ధికి భోగా రాము బరిలోకి….

On: Monday, December 15, 2025 7:42 PM

 

A9 news:

వెల్మల్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో భోగా రాము సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు.

ఫుట్‌బాల్ గుర్తు నుంచి పోటీ చేస్తున్న భోగా రాము మాట్లాడుతూ – గ్రామంలోని ప్రతి సమస్యను ప్రజలతో కలిసి పరిష్కరించడమే తన లక్ష్యమన్నారు.

బడుగు బలహీన వర్గాల సంక్షేమం, తాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, పెన్షన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

వెల్మల్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలని, ఫుట్‌బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను భోగా రాము విజ్ఞప్తి చేశారు.

01 May 2026

Leave a Comment