A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

*జాతీయ జెండాకు అవమానం..

సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో ..

 

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగిందన్న మేధావులు విమర్శిస్తున్నారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోనియాగాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ జన్మదినని పురస్కరించుకొని కేకును ఏర్పాటు చేశారు. కేకు పై మూడు రంగుల తో కూడిన అశోక చక్రం ను ఏర్పాటు చేశారు. సోనియాగాంధీ జన్మదినాన్ని కాంగ్రెస్ నాయకులు అశోక చక్రం ఉన్న దానిని కత్తితో కోయడం పట్ల రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

..జన్మదిన వేడుకలు ఎంత పెద్ద వారివి అయిన కానీ జాతీయ జెండా కలిగిన కేక్ కట్ చేయడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… ఈ సంఘటనపై పౌర హక్కుల నేతలు ప్రజలు ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.. బిజెపి టిఆర్ఎస్ నాయకులు కేక్ కటింగ్ పట్ల అభ్యంతర అనే వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం జాతీయ జెండాకు అవమానం జరిగిందన్నరు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాయకులు ఇలాంటి చేష్టలు లుడిగిన పనులు చేయడం నీ తీవ్రంగా ఖండిస్తున్నారు.ఇలాంటి సంఘటన పురాణావృతం కాకుండా ప్రభుత్వం అక్కడ పంది చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ జెండా కలిగిన కేక్ అని తెలిసినా కూడా బాధ్యతగల ఏఎంసి చైర్మన్ సాయిబాబాగౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేక్ కట్ చేయడం వెనుక అంతర్యం ఏమిటోనని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు ….

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *