A9 న్యూస్ నిజామాబాద్ జిల్లా, బ్యూరో:
*ముగ్గురు పిల్లలను విక్రయించిన కసాయి తల్లి..
-మంటగలుస్తున్న మానవత్వం..
-ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..
-సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసిన పోలీసులు..
ఆర్మూర్.. పిల్లలకు బుద్ధులు నేర్పించే తల్లి ముగ్గురు పిల్లలను విక్రయించి తల్లి అనే పదానికి మచ్చ తీసుకొచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. ధర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన సంగేమ్ భాగ్యలక్ష్మి భర్త ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్తను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలతో వచ్చి ఆర్మూర్ మామిడిపల్లిలో ఉంటున్నారు. మొదటి భర్తకు చెందిన ముగ్గురు పిల్లలను అమ్మకానికి పెట్టి జగిత్యాల్ జిల్లాలో ఒకరిని.. ఆర్మూర్ మండలంలోని సుర్బిరియల్ గ్రామంలో ఒకరిని.. భీంగల్ మండలం బెజ్జోరా గ్రామంలో ఒకరిని ఇలా ముగ్గురు పిల్లలను 4 లక్షల 20 వేలకు కసాయి తల్లి భాగ్యలక్ష్మి విక్రయించినట్లు తెలిసింది. రెండవ భర్తకు ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం. పిల్లలను విక్రయించిన విషయం తెలిసిన మొదటి భర్త మతిస్థిమితం కోల్పోయినట్లు సమాచారం. ఎవరు ఫిర్యాదు చేయకపోయినా విషయం తెలుసుకున్న పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవింద్ మీడియాకు తెలిపారు. భాగ్యలక్ష్మి పరారీలో ఉందన్నారు. విక్రయించిన పిల్లలను స్వాధీన పరుచుకుని బాలసదన్ కు అప్పగించామని అన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఆయన మీడియాతో చెప్పారు.