A9 న్యూస్ తెలంగాణ బ్యూరో:

 

కొల్లాపురంలోని రాణి ఇందిరా దేవి జూనియర్ కళాశాల (ఆరైడి) స్వర్ణోత్సవ సంబరాలు బ్రహ్మాండంగా జరిగాయి. ఆ కార్యక్రమాలలో దేశ విదేశాలలో ఉంటున్నటువంటి రాణి ఇందిరాదేవి జూనియర్ కళాశాల (ఆరైడి) పూర్వ విద్యార్థులు మూడు తరాలకు చెందిన వారు దాదాపు రెండువేల మంది హాజరయ్యారు.200మంది గురువులను సన్మానం చేశారు. బిట్స్ పిలాని వైస్ ఛాన్స్లర్ ప్రొ ఫెసర్ రామ్ గోపాల్ రావు హార్వార్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయరాం రెడ్డి మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ దయా సాగర్ రావు సినీ నటుడు విజయ్ దేవరకొండ వంటి వారితో పాటు అనేకమంది వివిధ రంగాలలో ప్రసిద్ధి చెందిన వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వివిధ రకాల సమాచారాన్ని ఉంచడం జరిగింది. అందులో షాద్నగర్లో ఉంటూ గతంలో కొల్లాపురం రాణి ఇందిరా దేవి కాలేజీలో ఇంటర్ చదివిన వంగూరి గంగిరెడ్డి ప్రతిరోజు వంగూరి వాచకం అనే కవితాత్మక సందేశాలను పోస్ట్ చేసేవారు. అయితే ఆ సందేశాలను చూసి ఎందరో ఇష్టంతో ప్రతిరోజు చదువుతూ తమ మిత్రులతో వాటి గురించి చర్చిస్తూ ఉండేవారు .ఈరోజు హైదరాబాద్లో ఆర్ ఐ డి స్వర్ణోత్సవాల సక్సెస్ మీట్ జరిగింది అందులో తమ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడిన వారికి ఆరైడిరత్న అనే అవార్డుతో సత్కరించాడు.మూడు నెలలుగా అందరి నాలుకలలో నానినటువంటి వంగూరు వాచకం ఆరైడి రత్న అవార్డు పొందడంతో వంగూరి గంగిరెడ్డిని ఆరైడి పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది సంఘం అధ్యక్షులు సాయి ప్రసాద్ రావు కార్యదర్శి మదన్ మోహన్ రావు తదితరులు మెమెంటో శాలువా తో వంగూరి గంగిరెడ్డి ని సన్మానించారు. భాస్కర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి అశోక్ కుమార్ చంద్రశేఖర్ విజయ గోపాల్ తదితరులు వంగూరి గంగిరెడ్డిని అభినందించారు.

గత నెల 27,28,29 తేదీలలో ఈ కార్యక్రమంలో నిర్వహించినట్టు తెలిపారు..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *