మహబూబాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు,…
-ప్రతి మూడు జిల్లాలకు ఓ పరిశీలకుడి నియామకం…
*నమస్తే ఇందూర్*: (నిజామాబాద్) నిజామాబాద్ జిల్లా బీజేపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ కోసం పార్టీ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి యెండల లక్ష్మీ నారాయణ పరిశీలకులను నియమించారు. మూడు జిల్లాలకు ఒక పరిశీ లకుడు ఈ ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. జిల్లాల వారీగా నియామ కాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కు చెందిన బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దోళ్ల గంగారెడ్డి, నీ నియమిస్తున్నట్లు బిజెపి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి, యెండల లక్ష్మీ నారాయణ, తెలిపారు అదే విధంగా జిల్లాలలో బిజెపి సీనియర్ నాయకులు సంస్థాగత ఎన్నికల అధికారిగా నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి మాట్లాడుతూ..భారతీ జనతా నాకు ఎంతో నమ్మకంతో మూడు జిల్లాల,సంస్థాగత ఎన్నికల పరిశీలకుడి నియామకంపై ఎంతో కృషితో పట్టుదలతో నాకు ఇచ్చిన బాధ్యతను కార్యకర్తలతో కలుపుకొని పార్టీ పనిని ముందుకు కొనసాగుతామని ఆయన తెలిపారు