మెదక్ జిల్లా మాసాయిపేట (మం) బొమ్మరం గ్రామ శివారులో అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న మూడు టిప్పర్లు ఒక హిటాచి సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ఒక్క హిటాచి సీజ్ సీజ్ చేయడం జరిగిందని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం బొమ్మరం హల్దీ వాగు శివారు నుండి అక్రమంగా గత వారం రోజులుగా హిటాచి సహాయంతో మూడు టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు గ్రామ మాజీ ఉపసర్పంచ్ శంకర్ సమాచారం మేరకు వీటిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. ఒకే నంబర్ తో రెండు వాహనాలు నడిపిస్తున్నారని పోలీసులు తెలిపారు దీంతో వాహనాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.