A9 న్యూస్ మెదక్ డిసెంబర్ 5
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయాల నే ఆలోచనతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ మండల జిల్లా స్థాయి సీఎం కప్ 2024 పోటీలను విజయవంతంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
యువజన క్రీడల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్థాయి పోటీలను ఈనెల 7 మరియు 8వ తేదీలలో నిర్వహించవలసిందని, మండల స్థాయి సీఎం కప్ పోటీలను 10 నుండి 12 వరకు నిర్వహించడం జరుగుతుందని అలాగే జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు 16 నుంచి 21 వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
అలాగే పోటీల నిర్వహణలో అవలంబించవలసిన నియమ నిబంధనలను మరియు పాటించవలసిన విధివిధానాలను కలెక్టర్ అందరికీ వివరించుతూ మెదక్ జిల్లాలో వివిధ స్థాయిలో సీఎం కప్ పోటీలు విజయవంతంగా నిర్వహించడానికి తమ వంతు సహకారం అందించగలరని కోరారు. నియమ నిబంధనలకు మరియు ఎంట్రీ ఫారంల యొక్క నమూనాను, నిర్వహించవలసిన క్రీడ అంశముల గురించి న వివరములను ఇవ్వడం జరిగింది
జిల్లాలో జరుగుతున్నటువంటి ఇంత చక్కటి క్రీడా పోటీలలో జిల్లా అధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు మండల స్థాయిలో ఎంపీడీవోలు ఎంఈఓ లు , వ్యాయామ ఉపాధ్యాయులతో కూడిన కమిటీ తరపున మన అందరి సహాయ సహకారాలను అందించాలని తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా కి ఎక్కువ పతకాలు లభించేలా కృషి చేయాలని వ్యాయామ ఉపాధ్యాయులకు మరియు పి డీలకు తెలిపారు.