A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి ఎస్ యు) ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల బంద్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పి డి ఎస్ యు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఫుడ్ పాయిజన్ తో పదుల సంఖ్య లో విద్యార్థులు చనిపోయారని, ముఖ్యంగా గురుకుల, కేజీవిపి, ఆశ్రమ పాఠశాలు, ప్రభుత్వ స్కూల్స్ లో తరచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని, నాణ్యమైన పోషక ఆహారం పెట్టాడటం లేదని,
సంబంధిత విద్యాశాఖ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని, ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సరైంది కాదని, పుడ్ పాయిజన్ తో చనిపోయిన విద్యార్థులకు ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వి డి ఎస్ యు నాయకులు రాహుల్, రహమాన్, కళ్యాణ్, పవన్, గణేష్ తదితరులు పాల్గొన్నా రు.