A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని 26 వార్డులో గల సులేమాన్ నఫీసా మస్జిద్ 26 వార్డుకు చివరగా ఉంటుంది కావున అధికారులు ఈ నాలుగు వీధులలో నిర్లక్ష్యం చూపుతున్నారు డ్రైనేజీలు నిండు కుండల మారి చెరువుల కనిపిస్తున్నాయి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో అందులో పందులు స్థావరం ఏర్పాటు చేసుకొని ఆ డ్రైనేజీని మరింతగా వెడల్పు చేస్తూ కాలనీవాసులకు ఇబ్బందికి గురి చేస్తున్నాయి చిన్న పిల్లలు సైతం ఆ చెట్ల కింద ఆడుకోవడం డ్రైనేజీ లోతు ఎక్కువ ఉండడంతో పిల్లలకు ప్రాణహాని ఉంటుందని కాలనీవాసులు భయపడుతున్నారు దీనికి మున్సిపల్ అధికారులు త్వరగా పరిష్కార మార్గం చేపట్టాలని మున్సిపల్ అధికారులను కాలనీవాసులు వేడుకుంటున్నారు.