*కస్తూర్బా బాలికల హాస్టల్ లో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది…
*కలెక్టర్, వైద్యశాఖ అధికారి ఆదేశాలు…
చిన్న శంకరంపేట మెదక్ నవంబర్ 28:
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల వైద్యాధికారి సాయి సింధు చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల హాస్టల్ లో స్థానిక వైద్యురాలు సాయి సింధు ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు 50 మంది విద్యార్థులకు వారు వైద్య పరీక్షలు నిర్వహించింది విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు, అదేవిధంగా వంటగదితోపాటు కూరగాయలు, బియ్యం, వంట సామాగ్రిని పరిశీలించి వంట నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండల కేంద్రంలోనీ కస్తూర్బా బాలికల హాస్టల్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా వైద్య అధికారి శ్రీరామ్ ఆదేశాల మేరకు విద్యార్థులకు వైద్య శిబిరం ఏర్పాటు చేసి 50 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగిందని చలికాలం సందర్భంగా వారికి దురద సమస్య ఉన్నందున మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు, ఈ కార్యక్రమంలో కస్తూరిబా పాఠశాల ప్రిన్సిపల్ గీత, మండల వైద్యాధికారి డాక్టర్ సాయి సింధు, డాక్టర్ హరీష, సిహెచ్ఓ యాదగిరిరావు, హెల్త్ సూపర్వైజర్ బుజ్జి, ల్యాబ్ టెక్నీషియన్ నర్సింలు, ఏఎన్ఎంలు కవిత, నాగలక్ష్మి, యాదమ్మ, ఆశ వర్కర్లు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.