ఆర్మూర్ పట్టణంలో యువకులకు ఆదర్శప్రాయమైనటువంటి స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రముఖ న్యాయవాది జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ కమిషనర్ కు విన్నవించడమైనది.
స్వామి వివేకానంద విగ్రహ ఏర్పాటులో ఆర్మూర్ పట్టణంలోని ప్రజలు, విద్యావంతులు, పారిశ్రామికవేత్తలు,వ్యాపారస్తులు, విద్యా- వైద్య సంస్థల సముదాయాలు ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా కోరడమైనది.
మున్సిపల్ కమిషనర్ ను కలిసిన వారిలో సుంకరి రంగన్న, మిరియాల్కర్ కిరణ్, మందుల పోశెట్టి, అంతాజి హజారి శ్రీనివాస్, పీర్ సింగ్ నాయక్, దక్షిణ మూర్తి, రాము, సాయన్న తదితరులు ఉన్నారు.