Tuesday, November 26, 2024

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. డేంజర్‌లో ఈ జిల్లాలు..!!

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

 

 

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో:

 

తెలుగురాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. ఏపీలో మన్యం ప్రాంతంతో పాటు తెలంగాణలో పలు చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది.

 

పల్లె, పట్నం తేడా లేకుండా జనాలకు చలి గజగజా వణికిస్తోంది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలను మంచుదుప్పటి కప్పేసింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

 

ఉత్తర, మధ్య తెలంగాణలో చలి తీవ్రత మరింత ఉందనిఅధికారులు వెల్లడించారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. సిర్పూర్‌లో అయితే రికార్డు స్థాయిలో 9.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ ప్రాంతంలో అత్యల్పంగా 9.9 డిగ్రీలు నమోదైంది.

 

మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. ప్రస్తుతం తూర్పు హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉన్నది. ఇది రాగల 24 గంటల్లో వాయవ్య దిశగా పయనించి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ అమరావతి విభాగం తెలిపంది. 48 గంటల్లో ఇది తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

 

ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈ నెల 29 వరకు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 27, 28 తేదీల్లో 40 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.

 

ఇవాళ, రేపు, ఎల్లుండి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 28న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

 

ఈ ప్రభావంతోనే చలి మరింత పెరగడానికి కారణం అని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కుమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నయోదు అయ్యే ఛాన్స్ ఉందని.. ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. పలు జిల్లాలో 15 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

 

చలి ప్రభావంతో ఆఫీస్‌లకు వెళ్లే, ఇతర పనులకు వెళ్లే వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ చలికాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా వైరల్ ఫీవర్లు, దగ్గు, జలుబు అనేవి వస్తుంటారు. ఇందుకోసం తగిన పోషకాహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here