A9 న్యూస్ ప్రతినిధి కోరుట్ల:
దేశంలోని ప్రతి మనిషికి రక్షణ కవచముల రాజ్యాంగం పనిచేస్తుందని అంబేడ్కర్ సంఘాల నాయకులు అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద 75వ రాజ్యాంగ దినోత్సవ నిమిత్తంగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కోరుట్ల సీఐ సురేష్ బాబులు వేరువేరుగా రాజ్యాంగం పుస్తకాలను ఆవిష్కరించి పలువురికి అందజేశారు. ఈ మేరకు సంఘాల నేతలు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతత్య్రం వచ్చిన కానీ దేశానికి రాజ్యాంగమే లేదన్నారు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశ పరిపాలన, ప్రతి మనిషికి కావలసిన హక్కుల్ని అందులో పొందుపరిచారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లే ప్రస్తుతం దేశంలో పరిపాలన కొనసాగుతుందన్నారు. ఐతే ప్రస్తుతం కొందరు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని వారు ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, బి.ఆర్.ఎస్ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు ఫాయిం, సంఘ నాయకులు ఉయ్యాల నర్సయ్య, బలిజ రాజారెడ్డి, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, ఉయ్యాల శోభన్, పేట భాస్కర్, పసుల కృష్ణ ప్రసాద్, శనిగారపు రాజేష్, కోడిపెల్లి సురేష్, భూపెల్లి నగేష్, చిట్యాల లచ్చయ్య, బలవంతుల సురేష్, మోర్తాడ్ రాజశేఖర్, అల్లం రాజమౌళి, సురేందర్, దేవయ్య వివిధ పార్టీల నాయకుల తోపాటు సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.