A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన గంట చిన్న ముత్తన్న(56) వారం రోజుల క్రితం ఖత్తర్ లో అనుమానాస్పదంగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిసింది. ఈరోజు “ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక” అధ్యక్షులు కోటపాటి నరసింహం నాయుడు నీ కలిసి చిన్న ముత్తన్న మృతదేహాన్ని తొందరగా ఇండియాకు రప్పించాల్సిందిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 16 సంవత్సరాలుగా వివిధ గల్ఫ్ దేశాలకు వెళ్తున్న ముత్తెన్న సంవత్సరం క్రితం ఖత్తర్ కు వెళ్లి అక్కడ ఒక షేక్ దగ్గర ఇంటి డ్రైవర్ గా పనిచేస్తున్న క్రమంలో యజమానితో ఏవో గొడవలు జరిగి డ్యూటీ కి దూరంగా ఉంటున్న క్రమంలో అనుమానాస్పదంగా మరణించినట్లు తెలిసిన విషయాన్ని, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరుగా విలపిస్తున్నారు. కోటపాటిని కలిసిన వెంటనే “ఖత్తర్ లోని” తెలంగాణ గల్ఫ్ సమితి” ముఖ్య నాయకుడు శంకర్ గౌడ్ ను సంప్రదించి ముత్తెన మృతదేహాన్ని త్వరగా ఇంటికి పంపి విధంగా కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అభ్యర్థించారు. ఇక్కడి నుండి పంపవలసిన నోటరీ, మరియు ఆధరైజేషన్ పత్రాలు పంపించారు. మృతదేహాన్ని తెప్పించుకోవడానికి అయ్యే ఖర్చు భరించే స్థితిలో కుటుంబ సభ్యులు లేరు కాబట్టి అక్కడి ఇండియన్ ఎంబసి నుండి మంజూరు చేయించి మృతదేహాన్ని పంపాల్సిందిగా శంకర్ గౌడ్ ను కోరడం జరిగింది. లేదా అక్కడి తెలంగాణ సంఘాల నుండి చందా రూపంలో జమ చేసి పంపాల్సిందిగా కోటపాటి కోరారు. త్వరలో మృతదేహాన్ని ఇండియాకు పంపడానికి శంకర్ గౌడ్ హామీ ఇచ్చారు కోటపాటిని కలిసిన వారిలో చిన్న ముత్తెన్న కుమారుడు సందీప్ మరియు వారి బంధువులు ఉన్నారు.