A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ భర్త దండు శేఖర్ పైన నిన్న నాగారం ప్రాంతంలో దాడి చేసి హత్య ప్రయత్నం చేయటాన్ని సిపిఎం పార్టీ ఖండిస్తున్నదని జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు తెలిపారు. దాడులు చేయటం ద్వారా గాని, హత్యలు చేయటం ద్వారా సమస్యలు పరిష్కారం కావని. చర్చల ద్వారా కానీ చట్టసభల ద్వారా కానీ సమస్యలను పరిష్కరించుకోవటానికి ఆకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ రకమైన దాడులను ప్రోత్సహించటం ఎవరికి సరైంది కాదని విడనాడాలని నిజామాబాద్ నగరంలో ప్రశాంత వాతావరణన్ని కొనసాగించాలని ఆయన తెలిపారు. అయితే కొద్దిమంది రాజకీయ నాయకుల ప్రోత్బలంతో ప్రజల ఆస్తులను భూములను స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నించుతున్నారని దాంతోపాటు ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారని అటువంటి వారిపైన ప్రభుత్వము పోలీసు యంత్రాంగం సకాలంలో చర్యలు తీసుకుంటే ఈ రకమైన అలజడలు జరగవని ఆయన తెలిపారు దండు శేఖర్ పైన దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా కఠినంగా వ్యవహరించాలని ఆయన తెలిపారు. సమావేశంలో పీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు నూర్జహాన్, నాయకులు దినేష్ తదితరులు పాల్గొన్నారు.