A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో మహిళా పాలిటెక్నిక్ విద్యార్థులతో క్యాంపస్ ఆవరణలో పి.డి.ఎస్.యూ ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ గత కొన్ని ఏండ్లుగా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్న గాని పాలకులు పట్టించుకోవడంలేదని,
ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్నారు గాని కానీ అధికారంలో వచ్చిన తర్వాత అమలు చేయడం లేదని,
ఇంజనీరింగ్ విద్య కోసం విద్యార్థులు హైదరాబాదు వెళ్లి చదువుకోవలసి వస్తుందని లక్షల రూపాయలు అదనపు భారం విద్యార్థుల పైన భారం పడుతుందని, దూరం ఉండటం వలన పేద విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరం అవుతున్నారని,
నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఉండి కూడా ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయకపోవడం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనం అని, జిల్లాలో ఏర్పాటు చేస్తూ నాలుగు జిల్లాల విద్యార్థులకు ఉపయోగపడుతుందని,
సిఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల తెచ్చుకుంటున్నాడని,జి ల్లాలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు స్పందించి నిజామాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ జిల్లా ఉపాధ్యక్షులు ప్రిన్స్, జిల్లా కోశాధికారి దేవిక, నాయకులు రాహుల్, సాయి కిరణ్, రాజు,మౌనిక, శ్రీజ తదితరులు పాల్గొన్నారు.