జక్రాన్ పల్లి మండలంలోని ప్రతీ గ్రామంలో ప్రత్యేక తనికీలు నిర్వహిస్తాం – ఎస్సై మహేష్.
A9 న్యూస్ ప్రతినిధి:
గ్రామ పంచాయతి ఎన్నికల నేపధ్యంలో జక్రాన్ పల్లి పరిధిలోని పోలీసులు తనిఖీలు మరింత కట్టు దిట్టం చేసారు.
జక్రాన్ పల్లి ఎస్సై మహేష్ మాట్లాడుతూ ఎన్నికల నీయమాలు ఎవరైనా ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసారు, ప్రజలు నిబంధనలు పాటించి శాంతియుత ఎన్నికలకు సహకరించాలని కోరారు, ఈ సందర్బంగా పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ నగదు,మద్యం, అనుమానస్పద వస్తువుల రవాణా పూర్తిగా అరికట్టెందుకు చర్యలు తీస్కుంటామని, ఎన్నికల సందర్బంగా ఎవరైనా ర్యాలీలు నిర్వహించాలి అనుకుంటే సంబంధించిన రిటర్నింగ్ అధికారి మరియు పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్టపరమైన చర్యలకు కారణం అవుతుందని కాబట్టి ప్రతీ రాజకీయ పార్టీల అభ్యర్థులు మరియు నిర్వాహకులు నీయమాలను పాటించి ఎన్నికల ప్రక్రియ సవ్యంగా సాగేందుకు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.








