నందిపేట్ మండలంలోని వన్నెల్ (కే) గ్రామానికి చెందిన బీజేపి సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ అబ్బి గంగారాం ను హైదరాబాద్ లోని ఆసుపత్రిలో కలిసి యోగ క్షేమలు తెలుసుకోవడానికి వెళ్లిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆయన పరిస్థితి చూసి వెంటనే స్పందించి 2 వ సారి 5 లక్షల ఎల్ వో సి లెటర్ ను ఇవ్వడం జరిగింది.అనారోగ్య బాధితుడు అబ్బి గంగారాం మాట్లాడుతూ… నా అనారోగ్య పరిస్థితిని చూసి మానవతా దృక్పథంతో మొదటిసారి 5 లక్షలు,రెండవసారి మరో 5 లక్షల ఎల్వోసి లెటర్ ఇచ్చినందుకు కుటుంబ సభ్యుల తరఫున ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
ఎమ్మెల్యే చేసిన మేలు జీవితాంతం మర్చిపోలేమని,విధేయతగా ఉంటూ సదా రుణపడి ఉంటామని అబ్బి గంగారాం, కుటుంబ సభ్యులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపి సీనియర్ నాయకులు బద్దం నడ్పి నాగన్న, బద్దం నారాయణ, గ్రామ అధ్యక్షులు రాయికంటి భరత్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ వాకిటి జీవన్ రెడ్డి,అబ్బి గంగారాం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.








