
A9 న్యూస్, జక్రాన్‌పల్లి:
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలోని 108, 102 అంబులెన్స్‌లను జిల్లా సూపర్వైజర్ స్వరాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లలో ఉన్న వైద్య పరికరాలు, అత్యవసర మందులు, రికార్డులను పరిశీలించి సేవల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా గర్భిణుల కోసం వినియోగించే 102 అంబులెన్స్ నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ తనిఖీలో ఈఎంటీ హరీష్, పైలట్ నవీన్, కెప్టెన్ శ్రీనాథ్ పాల్గొన్నారు.








