జలసిరి పనులతో భూగర్భ జలాల పెంపు గ్రామ సభ….

On: Wednesday, July 29, 2026 7:47 PM

 

ఎ9 న్యూస్,  మాసాయిపేట ,జులై ,29:

మాసాయిపేటమండలం పరిధిలోని స్టేషన్ మాసాయిపేట గ్రామపంచాయతీలో బుధవారం నాడు, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జలసిరి వి బి జి ఆర్ ఏ ఎం జి పథకంలో భాగంగా భూగర్భ జలమట్టాలను పెంచే లక్ష్యంతో బుధవారం నాడు

ప్రత్యేక గ్రామసభ నిర్వహించి పనుల ప్రాముఖ్యతను కార్యదర్శి వివరించారు. ఈ గ్రామసభల్లో ఎంపీఓ హాజరై భూగర్భజలాల పునరుద్ధరణకు చేపట్టాల్సిన ఇంకుడు గుంతలు, ఫామ్ పౌండ్లు, బోర్వెల్ రీఛార్జ్, కమ్యూనిటీ సోక్ పీట్లు, మ్యాజిక్ డ్రైన్ వంటి వివిధ రకాల పనుల గురించి ప్రజలకు సమగ్రంగా అవగాహన కల్పించారు. ఇందులో భాగంగానే గ్రామంలో ఒక రైతు పొలంలో ఫామ్ పౌండ్ నిర్మాణానికి తీర్మానం జరిగిందని తెలిపారు. అనంతరం గ్రామ అభివృద్ధి కోసం ఉపాధి పథకంలో పని చేయడానికి ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఉండాలని గ్రామంలో మైకులో మాట్లాడారు అనంతరం ఇంటింటికి చెట్టు మొక్కలను సర్పంచ్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరింగింది ఈ కార్యక్రమంలో స్టేషన్ మాసాయిపేట్ గ్రామా సర్పంచ్ శ్రీనివాస్ , ఉపసర్పంచ్ పాలకవర్గం సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

29 Jul 2026

Leave a Comment