A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
-శేఖర్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం మాజీ,ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
-బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి :
నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త దండు శేఖర్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దండు శేఖర్ ను బుధవారం ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆందోళన చెంద వద్దని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.