జోరుగా కొనసాగుతున్న ” కోటి మృత్యుంజయ” మంత్రజపాల
A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నవంబర్ 13:
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో కేంద్రంలో అమృత ద్వారా సేవా సంస్థ ద్వారా ” కోటి మృత్యుంజయ” మంత్రజపాలు జోరుగా కొనసాగుతున్నాయి.ఈనెల మూడో తేదీ నుండి 15వ తేదీ వరకు బాల్కొండ నియోజకవర్గం కేంద్రంలోనీ
లలితా దేవి ఆలయంలో లోక కన్య కళ్యాణార్థం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అమృత ధార వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ హరాచారి నారాయణ తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం 8 నుండి 12:00 వరకు పూజ అభిషేకము అర్చన మరియు రుద్రహోమము తో పాటు సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు “మహా రుద్రాభిషేకo” భక్తుల సమక్షంలో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.అలాగే నేడు 14వ తేదీన స్థానిక ఉన్నత పాఠశాల మైదానంలో పదివేల భక్తులతో మహా దేవునికి “మాహాద్రము” ముగింపు కార్యక్రమం జరుగుతుందని ఇందులో 10,000 భక్తుల తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని ఆయన వివరించారు. ఇది ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈనెల 15వ తేదీ కార్తీకధిపొచ్చవం బాల్కొండ సమీపంలోని జలాల్ పూర్ లోని గోదావరి నది ఒడ్డున అమృత ద్వారా ఆశ్రమంలో సాయంత్రము “కోటి దీపోత్సవం “నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కార్యదర్శి హరాచారి హరి తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తుల సౌకర్యార్థం వసతి భోజన వసతులు ఏర్పాట్లు చేస్తున్నట్లు హరచరి హరి వివరించారు.
2022 మరియు 2033 కార్తీక మాసంలో ప్రారంభం లో “కోటి హనుమాన్ చాలీసా” మరియు కోటి లలిత సహస్రనామ జపాలు అనేక వేల మంది భక్తులచే
నెల రోజుల పాటు నిర్వహించి ప్రముఖుల చేత ప్రసంశలు పొందారు. గత 15 రోజులుగా జరుగుతున్న “కోటి మృత్యుంజయ” మంత్రజపాలు శ్రీశ్రీశ్రీ హరాచారి నారాయణ స్వామీజీ వారీ నేతృత్వంలో ప్రముఖ పురోహితు లైన హరాచారి హరి దుర్గాప్రసాద్ శర్మ, గోపాల్ శర్మ నిర్వహించడం విశేషం.