నవంబర్ 17న నిజామాబాద్లో జరిగే మతోన్మాద వ్యతిరేక సదస్సును జయప్రదం చేయండి.
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
నిజామాబాద్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు
కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో 2024 నవంబర్ 17న నిజాంబాద్ జిల్లా కేంద్రంలో జరిగే మతోన్మాద వ్యతిరేక సదస్సును జయప్రదం చేయాలని న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు.
మామిడిపల్లి గ్రామంలో 13 నవంబర్ 2024న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. దాసు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తుందని, భారత రాజ్యాంగాన్ని ఖూనిచేస్తూ,
ప్రజల మధ్య భావోద్వేగాలనీ
రెచ్చగొడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మతం వ్యక్తిగతమని, కానీ మతం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని ఆయన అన్నారు. కులం ,మతం, ప్రాంతం పేరుతో పాలక వర్గ పార్టీలు ప్రజల ఆలోచనలు వక్రమార్గం పట్టిస్తున్నాయని ఆయన తెలిపారు. 10 సంవత్సరాల పాలనలో బిజెపి నరేంద్ర మోడీ సర్కార్ ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి, ప్రశ్నిస్తే నిర్బంధిస్తుందని ఆయన అన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లు, వ్యవసాయ వ్యతిరేక మూడు నల్ల చట్టాలు తెచ్చి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన అన్నారు. సుస్థిర పాలన, ఏటా రెండు కోట్ల కొలువుల మాట నీళ్ల మూటగా మారిందని ఆయన తెలిపారు. పనైనా చూపండి తిండి అయినా పెట్టండి అని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని రుణమాఫీ అందరికీ వెంటనే జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు 4000 జీవన భృతి ఇవ్వాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులు సూర్య శివాజీ, బాలయ్య, అబ్దుల్, మార్క్స్, ప్రిన్స్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.