A9 న్యూస్.గన్నారం. గ్రామం లోధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన ఎంపీ.అరవింద్” నిజామాబాద్ జిల్లాఇందల్వాయి మండలం లో గన్నారం గ్రామంలో ధాన్యం కనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎంపీ అరవింద్.. పాల్గొన్న నిజాంబాద్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా,బిజెపి జిల్లా అధ్యక్షులు. దినేష్ కుమార్ కార్యకర్తలు.ఈ సందర్భంగా ధాన్యం కనుక్కోవాలి కేంద్రాలను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకుని విలేకరులతో ఎంపీ.అరవింద్ మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ రైతుల వ్యతిరేక పార్టీ అని రైతులను మోసం చేస్తుందని ఏడాదికాలంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చక తుంగలో తొక్కిందని నిజామాబాద్ ఎంపీ. ధర్మపురి అరవింద్ ఆరోపించారు.రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా! పక్క రాష్ట్రంలో మీ గురువుగారు చంద్రబాబు నాయుడు ప్రజలకు ఉపయోగ పనులు చేపడుతూ 10 లక్షల కోట్ల రిలయన్స్ గ్యాస్ పెట్టుబడులను ఆహ్వానించాడని దీంతో రెండున్నర లక్షల ఉద్యోగాలు మరియు ప్రతి రైతుకు ఒక ఎకరానికి అదనంగా 30 వేల రూపాయలు లాభం చేకూరుతుందని అన్నారు.నీవు చంద్రబాబు శిష్యుడు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుచూపు లేకుంటే నీవు కేసీఆర్ శిష్యుడుగా ప్రజలు అనుకుంటారని ఎద్దేవా చేశారు..తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ధాన్యం కనుగొన్న కేంద్రాలు పూర్తిస్థాయిలో వడ్లు జరగలేదని,సన్నాళ్లకు 500 ఇస్తానన్న బోనస్ ఇప్పటికి అందించాలని. రాష్ట్ర ముఖ్యమంత్రి క్వింటాల్కు నాలుగున్నర కిలోలు కడతా తీస్తున్నారని రెండు లక్షల రుణమాఫీ ఇంకా అందించ లేక మోసం చేశాడని.,ప్రజలు గ్రహిస్తున్నారని ఎంపీ. అరవింద్ అన్నారు.ఏడాదిసంవత్సరం పాలన పూర్తి అయినా కానీ ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయగా తుంగలో తొక్కారని ఏడాది పాలన తర్వాత అయినా రేవంత్ రెడ్డి తీరు మారుతుందని ఆశించిన రైతుల పరిస్థితి పొయ్యి మీద నుండి పెనం మీద పడ్డట్టు అయిందని విమర్శించారు.ఇంత సమయం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తీరు మారలేదని మరొక కేసీఆర్ గా పాలన కోనసాగిస్తున్నాడని అన్నారు. వచ్చే కర్రీలో రైతులకు అండగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కోతలకు ముందుగా వరి ధాన్యం కనుగొన్న కేంద్రం ఏర్పాటు చేయించే ప్రక్రియ చేస్తామన్నారు.భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రకంపనలు వస్తున్నాయని అధికారంలో చేతులో లేక ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసొచ్చానని చెప్పడం విడ్డూరమన్నారు.రాష్ట్రంలో సర్కార్ను నిలదీయలేక జాతీయస్థాయిలో ఎవరు గొప్ప కొరకు వెళ్లి ఏం సాధించావని నిలదీశారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ మండల బిజెపి అధ్యక్షులు. రాజన్న బిజెపి సీనియర్ నాయకులు కే.పి.రెడ్డి మోహన్ రెడ్డి శ్రీనివాస్ రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు