A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
తథాగతుడైన గౌతమ బుద్ధుడు ఆయుర్వేదం పట్ల నిపుణుడు. సమతా యోధులైన తన శిష్యుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని “వర్షావాసం” ప్రారంభించిన ఘనత గౌతముడిది. తన అత్యంత సన్నిహితుడైన వైద్యుడైన జీవకుడు. ప్రకృతిలోని చెట్లు ఆకులు నార్లు కందామూలాల వైద్య రహస్యాలను కనుగొని మానవ నిరోగానికి ఉపయోగించారు. బౌద్ధ కాలంలోనే వైద్యానికి పెద్దపీట వేసిన ఘనత జీవకుడిదే. సమ్రాట్ అశోకుడి కాలంలో అది మరింత వికసించింది. బుద్ధుడికి శరణం పోవడం అంటే మానవుని సకల మానసిక రోగాలను శుద్ధీకరించుకోవడమే. మహా ఆరోగ్యవంతంగా జీవించడమే. శుక్రవారం సాయంత్రం జిల్లా నిజమాబాద్ మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామ శివర్లోగల మోక్షనందా బుద్ద విహార్లోని ప్రఖ్యాత బౌద్ధాచార్యులు భంతే ధమ్మరఖ్ఖిత గారిని బౌద్ధ ఉపాసకులు కల్సి దీవెనలు పొందారు. ఈ సందర్భంగా భంతే గారు మాట్లాడుతూ ప్రతి పూర్ణిమ రోజున (15 నవంబర్) తమ విహార్/మందిరం నందు వచ్చి బుద్దుడి ఆరోగ్యకరమైన బోదనల్ని ఆకళింపు చేసుకోవాలని బహుజన లోకానికి విజ్ఞప్తి చేశారు. ఇందులో పులి రాజన్న, నీరడి భుమేశ్వర్, మూలనివాసి మాలజీ, తల్లి ముత్తుబాయి, సతీమణి మమత భంతే గారిచే సుఖశాంతుల ఆశీర్వాదం పొందారు.