A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి:
ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువు లో శుక్రవారం నాడు చేప పిల్లలు విడుదల చేయడం జరిగింది. ఎంఎల్ఏ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 27లక్షల 96వేల చేప పిల్లలను 190 చెరువులోకి విడుదల చేస్తున్నాం గుండ్ల చెరువులో 55వేల చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది.
చేప పిల్లల విడుదల ఆలస్యం అయింది అని ప్రభుత్వం మృత్యకరుల పై కపట ప్రేమ చూపుతుంది గతం లో వంద శాతం విడుదల చేస్తే ఈ సారి యాభై శాతం చేయడం దురదృష్టం బీజేపీ ప్రభుత్వం మృత్యకరులకు 75శాతం సబ్సిడీ పై వాహనాలు అందజేసింది, విరి అభివృద్ధి కోసం కృషి చేస్తాం అని చేపలు పట్టే వారు ప్రభుత్వం ద్వారా పొందే అన్ని పథకాలకు అర్హులు అని ఎమ్మెల్యే ఎన్నికల్లో మొదట మద్దతు తెలిపింది కూడా గంగా పుత్రులు అని గుర్తు చేశారు చెరువులు ఆక్రమణ కాకుండా చడలని, కబ్జా అయినా చెరువులను సర్వే చేసి స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిషరింగ్ అధికారి ఆంజనేయులు, పెంటన్న, కంచెట్టి గంగాధర్, చిన్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.