సుప్రీంకోర్టు సీఎజేఐపై దాడి కేసు: రాకేష్ కిషోర్‌ను వెంటనే అరెస్టు చేయాలి – దళిత సంఘాల డిమాండ్…..

On: Sunday, November 16, 2025 9:16 PM

ఎ9 న్యూస్, మాసాయిపేట – నవంబర్ 16:

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గావాయి గారిపై జరిగిన దాడికి నేటితో 37 రోజులు పూర్తయ్యినా, దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్న రాకేష్ కిషోర్ను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడంపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఈ నేపథ్యంలో నవంబర్ 17న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఢిల్లీలో నిర్వహించనున్న దళితుల ఆత్మగౌరవ నిరసన మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుతూ మెదక్ జిల్లా MFS అనుబంధ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ:

“దేశ అత్యున్నత న్యాయస్థానాధ్యక్షుడిపై దాడి జరిగి ఇన్ని రోజులు కావొచ్చినా, దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయకుండా వ్యవస్థ నిర్లక్ష్యం చేస్తోంది. ఇది న్యాయవ్యవస్థపై నేరుగా దాడి చేసినట్లే,”

“రాకేష్ కిషోర్‌ను కాపాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది,” అన్నారు.

దళిత నాయకులు పేర్కొంటూ:

“నేడు భారతదేశంలో దళితులకు రక్షణ, ఆత్మగౌరవం సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.”

“దేశభక్తులు మరియు దేశద్రోహుల మధ్య పోరాటం జరుగుతోంది. న్యాయవ్యవస్థకు గౌరవం లేకపోతే సామాన్య ప్రజలకు న్యాయం ఎలా అందుతుంది?” అని ప్రశ్నించారు.

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు యాదగిరి మాదిగ హెచ్చరిస్తూ,“సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చెలరేగుతాయి,” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, యువత అసోసియేషన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

16 Dec 2025

Leave a Comment