తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని ఆఫియా నాజ్ ప్రతిభకు నిదర్శనం – జిల్లా, రాష్ట్ర స్థాయిలో విశిష్ట విజయo….

On: Saturday, June 13, 2026 6:39 PM

 

తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని ఆఫియా నాజ్ ప్రతిభకు నిదర్శనం – జిల్లా, రాష్ట్ర స్థాయిలో విశిష్ట విజయo.

ఆర్మూర్: ఆఫియా నాజ్ పదో తరగతి పరీక్షల్లో 600 మార్కులకు గాను 566 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. 8వ తరగతి నుండి తెలంగాణ మోడల్ స్కూల్ ఆర్మూర్లో చదువుతున్న ఆమె, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతో విద్యా రంగంలో విశేష విజయాలు సాధించింది.

ఆఫియా నాజ్ గణితంలో జిల్లా స్థాయిలో 2వ స్థానం, రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం, శాస్త్రంలో జిల్లా స్థాయిలో 1వ స్థానం, ఆంగ్లంలో జిల్లా స్థాయిలో 3వ స్థానం, సాంఘిక శాస్త్రంలో మండల స్థాయిలో 2వ స్థానం సాధించి పాఠశాలకు గౌరవం తీసుకొచ్చింది.

ముఖ్యంగా జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు సంధ్య రాణి గారి ప్రోత్సాహంతో ఆఫియా నాజ్ కపిల్ విద్యా వారధి నిర్వహించిన అర్హత పరీక్షలో పాల్గొని ఎంపికైంది. దీంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన ఆమె ప్రస్తుతం కరీంనగర్‌లోని ఒక ప్రముఖ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. కపిల్ విద్యా వారధి సంస్థ ఆమె ఉన్నత విద్య పూర్తయ్యే వరకు అవసరమైన సహకారం అందించనుంది.

ఈ సందర్భంగా ఆఫియా నాజ్ మాట్లాడుతూ, తన విజయాలకు కారణమైన ప్రిన్సిపాల్ A.V.R. శ్యామ్ గారికి, అలాగే ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపింది.

ప్రత్యేకంగా జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు సంధ్య రాణి మేడం గారి గురించి మాట్లాడుతూ, “నాలోని ప్రతిభను గుర్తించి, కపిల్ విద్యా వారధిలో చేరే అవకాశాన్ని కల్పించిన సంధ్య రాణి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒక మంచి గురువు విద్యార్థి జీవితాన్ని ఎంత గొప్పగా మలచగలరో ఆమె నిరూపించారు” అని పేర్కొంది.

ఆఫియా నాజ్ సాధించిన ఈ విజయాలు ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పాఠశాల వర్గాలు అభినందించాయి.

13 Jun 2026

Leave a Comment