జూన్ 17 నుంచి దరఖాస్తులు, 2028 ఏప్రిల్ 30 వరకు చెల్లుబాటు…..
రాష్ట్ర, జిల్లా స్థాయి పనిచేస్తున్న జర్నలిస్టులకు TSRTC కొత్త జర్నలిస్ట్ బస్ పాసులను ఆన్‌లైన్ ద్వారా జారీ చేయనుంది.
సోమవారం TSRTC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, 2026-2028 సంవత్సరాలకు I&PR శాఖ జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులు ఉన్న పనిచేస్తున్న జర్నలిస్టులకు రాయితీ బస్ పాసులు ఇవ్వనున్నారు. పాసుల చెల్లుబాటు 17.06.2026 నుంచి 30.04.2028 వరకు ఉంటుంది.
I&PR శాఖ 10.06.2026 తేదీన జారీ చేసిన లేఖ మేరకు, అర్హత ఉన్న జర్నలిస్టులకు 17.06.2026 నుంచి ఆన్‌లైన్ ద్వారా బస్ పాసుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అన్ని ప్రాంతీయ మేనేజర్లు తమ పరిధిలోని అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని TSRTC ఆదేశించింది.
జర్నలిస్ట్ బస్ పాసులపై ఏమైనా సందేహాలు ఉంటే 9959226390 నంబర్‌లో సంప్రదించవచ్చని TSRTC తెలిపింది.







