ఆర్మూర్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి పి. శ్రీదేవి….
ఆర్మూర్, జూన్ 20: ఆర్మూర్ కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్‌పర్సన్, పి. శ్రీదేవి ఆధ్వర్యంలో రాజీ కుదిరిన పలు కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సరళ రాణి, భవ్యశ్రీ, గట్టు గంగాధర్ పాల్గొన్నారు. మొత్తం నాలుగు కోర్టులకు సంబంధించిన కేసులను పరిశీలించి, 7,657 కేసులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుదురుపాక ప్రవీణ్ చందర్, ఉపాధ్యక్షుడు గుంజల సుదర్శన్, కార్యదర్శి పోడేటి శంకర్, కోశాధికారి వడ్నాల రాజేందర్తో పాటు న్యాయవాదులు, లోక్ అదాలత్ సభ్యులు, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది, బ్యాంకు సిబ్బంది, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.







