A9 న్యూస్ ప్రతినిధి:
వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామంలో రోడ్ నెంబర్ 63 ని ఆనుకొని అడవుల తిరుపతి అనే రైతు యొక్క ద్విచక్ర వాహనం పోయిందని ఆవేదనకు గురయ్యాడు. రోజు లాగానే తన తోటలోకి వెళ్లి ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కన పెట్టి పక్కనే ఉన్న తోటలోకి వెళ్లి వచ్చి చూచేసరికి ద్విచక్ర వాహనం నంబర్ ఏపీ 25 ఏ ఎం4835 గల వాహనం కనబడడం లేదని అన్నారు. చుట్టుపక్కలంతా వెతికినా గాని దొరకకపోవడంతో రైతు యొక్క ముఖం చిన్న పోయింది.అక్కడ ఉన్న స్థానికు తోటలో ఎంత వెతికిన గాని ద్విచక్ర వాహనం దుర్కకపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం తో కుంగిపోతున్నాడు.