A9 న్యూస్ ప్రతినిధి భీంగల్:
దక్షిణ బద్రీనాథ్ గా ప్రసిద్ది పొందిన భీంగల్ లింబాద్రి గుట్ట నర్సింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుండి 17 వరకు పదిరోజుల పాటు జరిగే నిత్య ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామం నుంచి స్వామి వారిని కొండపైకి తెచ్చి ఉద్వాసన బలి ప్రదానం, పుష్కరిణిపై డోల సేవ నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు తిరిగి గ్రామానికి చేరుకోనున్నారు. 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేషంగా రధోత్సవం, జాతర నిర్వహించనున్నారు. ఎత్తయిన శిఖరం తప్ప ప్రత్యేక ఆలయం లేని క్షేత్రమే భీంగల్ లో ని లింబాద్రిగుట్ట. కొండగుహలో స్వయం భుగా కొలువు దీరిన లక్ష్మీనర్సింహ స్వామి సంతాన ప్రదాతగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. స్వామి వారి మూలవిరాట్ పక్కన విష్ణుమూర్తి కృష్ణార్జునుల విగ్రహాలు ఉన్నాయి. బద్రీనాథ్ తరహాలోనే ఇక్కడ విగ్ర హాలు ఉండడంతో ఈ ఆలయాన్ని దక్షిణ బద్రీనాథ్ పిలుస్తారు. ఆలయ స్థలపురాణం..పార్వతీ పరమేశ్వర కల్యాణానికి హాజ రైన బ్రహ్మదేవుడు ఆ సమయంలో పార్వతీదేవి పాదాలను చూశాడు. అది గమనించి ఆగ్ర హించిన పరమేశ్వరుడు బ్రహ్మదేవుని ఐదో తలను ఖండిం చడంతో బ్రహ్మ ఈ ప్రాంతానికి వచ్చి శ్రీవారి అనుగ్రహం కోసం తపస్సు చేశాడని, తపస్సుకు మెచ్చిన శ్రీమన్నారయణ నర్సింహస్వామి రూపంలో ఈ ప్రాంతంలో కొలువు దీరాలని బ్రహ్మ వేడుకోగా.. లక్ష్మీ సమేతంగా స్వయంభుగా వెలిశారని ప్రసిద్ధి. హిరణ్య కశ్యపుని సంహారం తర్వాత నర్సింహస్వామి ఈ ప్రాంతంలో సేదతీరి స్వయంభుగా వెలిశారని కూడా ప్రసిద్ధి. బ్రహ్మ ఐదోతల ఖండించాక పరమేశ్వరుడు బ్రహ్మ హత్య దోష నివారణకు తపస్సు చేయడంతో విష్ణుమూర్తి అనుగ్రహించి ఇక్కడ జోడు లింగాల రూపంలో ఆలయం ముందు భాగంలో కొలువుదీరారని కూడా చెబుతారు.
*ఇతర ప్రాంతాల నుంచి భక్తులు..*
ఉత్తర తెలంగాణలో అతిపెద్ద జాతర రథోత్సవంగా లింబాద్రిగుట్టలో బ్ర హ్మోత్సవాలు జరుగుతాయి. 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగే రథోత్సవానికి ఆర్మూర్ నిజామాబాద్, భీమ్గల్, జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్, అదిలాబాద్ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. రథోత్సవం నాడు భక్తులతో కొండ కిక్కిరిసిపోతుంది. శ్లో: నమో నింబగిరిశాయ కమలనాయకాయతే జీవసంతాు బారాయ జగజ్జనాది హేతవే వేదవేదాంతవేద్యాయ దశరూపాదిధారినే స్తోతుంత్వాంసమర్థోస్మి విదేహి కరుణాంమయి॥
నిరంతరము శ్రీమన్నింబాద్రిలక్ష్మీనృసింహస్వామి వారి మంగళాశాసనములు కోరుకునే మీకు తెలియజేయునది ఏమనగా అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడు, సత్యాశేష విశ్వానికి కారకుడు, నిఖిలగుణపూర్ణుడు, వేదవేదాంతవేద్యుడు, సర్వోత్తముడు, అనంతజీవులకు ఆశ్రయుడు, సర్వజగద్రక్షకుడు, ఆనందతీర్థవరదుడు ఐన శ్రీనింబాద్రిలక్ష్మీనృసింహస్వామి వారి నిత్యబ్రహ్మోత్సవ కార్యక్రమములు శ్రీ క్రోధి నామ సం|| కార్తీక శు,, షష్ఠి 07-11-2024 గురువారము నుండి బ॥ ప్రతిపద 17-11-2024 శనివారము వరకు నిర్వహించబడును.ఈ సందర్భమును పురస్కరించుకొని మీరు సకుటుంబ సపరివార సమేతముగా ఈ దిగువకార్యక్రమములయందు పాల్గొని శ్రీవారిని సేవించుకొని తీర్థ ప్రసాదములు గైకొని శ్రీమన్నింబాచలేశుని అనుగ్రహమునకు పాత్రులు కాగలరు. ఉత్సవ కార్యక్రమ వివరములు 07-11-2024 ఉత్సవ ఆరంభము సందర్భంగా గ్రామదేవతకు సారెసమర్పణ శ్రీవారు మ 1:30 గం.లకు గ్రామాలయము నుండి కొండ పైకి బయలుదేరుట. 08-11-2024 దీపారాధన, రక్షాబంధనము, మృత్సంగ్రహణము, అంకురార్పణము, గరుడపటాధివాసము, ధ్వజారోహణము. 09-11-2024 శ్రవణప్రయుక్త క్షీరాభిషేకం, నృసింహ ఏకాక్షరిహవనము. 10-11-2024 శ్రీవారి కళ్యాణము ఎదురుకోలు మ॥2.00 గం॥లకు 1-11-2024 శ్రీవారి కళ్యాణము మ॥ 12:30 గం, లకు 12-11-2024 సర్వేశాం ఏకాదశి, చాతుర్మాస్య వ్రతసమాప్తి,నృసింహ ఏకాక్షరిహవనము గీతాహవనము గరుడ సేవ సా.500 లకు. 13-11-2024 ఉత్థాన ద్వాదశి, తుళసివివాహము, కొండ ప్రదక్షిణము ఉ॥ 11.00 గం|| లకు 14-11-2024 వైకుంఠ చతుర్దశి, సా|| 5.30గం||లకు సీతానగరము పై డోలారోహణము. 15-11-2024 కార్తీకపౌర్ణిమ, రథోత్సవము, మ॥ 3.00 గం||లకు జాతర, శ్రీవారి రథభ్రమణము. 16-11-2024 ఉదయాత్పూర్వము శేషహోమము. శ్రీవారికి స్నపన తిరుమంజనము, చక్రతీర్ధము భాగవత ఫలశృతి, పూర్ణాహుతి, రాత్రి 7.00 గం॥లకు పుష్పయాగము. 17-11-2024 దేవతోద్వాసనము. ధ్వజావరోహణము, ఉద్వాసన బలిప్రదానము, కొండబలి. పుష్కరిణి పై డోలోత్సవం, సాయంత్రము శ్రీవారిని అశ్వవాహనము పై గ్రామాలయమునకు ఊరేగింపు, సప్తవరణపూజ తో ఉత్సవ సమాప్తి,…