ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే బుధవారం ప్రారంభమైంది. ఈ సర్వేను ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజులు పరిశీలించారు. అధికారులు సిబ్బంది సర్వే చేస్తున్న తీరును పరిశీలించారు. ప్రజలు సర్వేకు వచ్చిన సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది తర్వాత ప్రజా శ్రేయస్సు కోసమే పని చేస్తుందని అందులోనే భాగంగా ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగపడే విధంగా సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వం నిర్వహిస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ అన్నారు. ఈ సర్వేలో సామాజిక, విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ, కుల, తదితర వివరాలను అధికారులు సేకరిస్తారని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు సర్వేను చేయాలన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో 20వేలకు పైగా ఇండ్లు ఉన్నాయని తెలిపారు. సర్వే కోసం 14 మంది సూపర్వైజర్లు, 140 మంది ఎన్యుమరేటర్లను నియమించామన్నారు. ఈ సర్వే ప్రక్రియ ఈ నెల చివరి వరకు జరగనుంది అన్నారు.