ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్రస్థాయిల విఫలమైన కాంగ్రెస్ సర్కారు రైతులని మహిళలని విద్యార్థులని ఉద్యోగులని ఆటో కార్మికులని నిరుద్యోగులని మోసం చేస్తే జిల్లా స్థాయిలో కూడా అబద్దాలతో కాలం గడుపుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులను మేమిచ్చామంటూ మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని మోసం చేస్తుంది. నందిపేట్ మండల కేంద్రంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి వచ్చి మాట్లాడుతూ గతంలో 44 లక్షల రూపాయలను గ్రంథాలయం భవనం నిర్మాణం కోసం జీవన్ రెడ్డి గారి కృషితో అప్పటి చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్ గారు కేటాయిస్తే ఈరోజు కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరు కొత్తగా రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు గతంలో ప్రభుత్వం నందిపేట్ మండలానికి కేటాయించిన 40 కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ ,15 కోట్ల రూపాయల సిడిపి, 10 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులను ఉపయోగిస్తే మండలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అభివృద్ధికి రూపాయి కేటాయించకుండా అబద్దాలతో కాలం గడుపుతున్నారు. కాంట్రాక్టర్లను కమిషన్ల కోసం కక్కుర్తి పడి పనులు ఆపుతున్నారు. 154కుల సంఘ భవనాలకు రోడ్డు నిర్మాణాల కోసం ఆలయాలు మసీదులు చర్చిల అభివృద్ధికి కేటాయించిన నిధులు ఆపి కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా ఈ వైఖరిని విడనాడి టిఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలి లేకపోతే నందిపేట్ మండలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని మండల పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు ఎర్రం మురళి, దుబాయ్ శీను దడిగే ప్రవీణ్ మైనార్టీ నాయకులు పాషా ఎస్వీ సతీష్ గాండ్ల సంతోష్ నాని రాజేందర్ తాటికాయల సాగర్ దర్వాడి అశోక్ పిరాజి రాజ్ కుమార్ మచ్చర్ల సతీష్ స్వామి శేఖర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి బస్వరాజు