-వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కి కాల్ చేసి డబల్ బెడ్ రూమ్ కుటుంబానికి ఇవ్వాలని చెప్పిన మల్లన్న
-నేను చదువుకొని గొప్పదాన్ని అవుతా
-మల్లన్న ప్రోత్సాహంతో మంచిగా చదువుకుంటా
నర్సింగ్ విద్యార్థిని శ్రీనిధి
హన్మకొండ గోపాలపురం కు చెందిన ఇంజ మహేశ్వరి ఆంజనేయులు కూతురు ఇంజ శ్రీనిధి బిఎస్సి నర్సింగ్ కోర్స్ లో జాయిన్ అయిన నేపథ్యంలో చదువుకోడానికి ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలిసి వెంటనే తన గూడు వెల్లబోసుకున్నారు తండ్రి ఆంజనేయులు డయాలసిస్ పేషంట్.. లైవ్ లో తీసుకొని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే నాగరాజ్ కు కాల్ చేసి ఈ కుటుంబానికి డబల్ బెడ్ రూమ్ కూడా సాంక్షన్ చేయమని కోరిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కుటుంబం మొత్తం ఆర్థికంగా చిదిమీ పోతున్నది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెంటనే లైవ్ లోకి తీసుకొని ఆ బిడ్డ చదువు కోసం 50 వేల రూపాయల చెక్కును అందజేశాడు. ఇలా ఎంతోమంది అభాగ్యులకు చదువు మధ్యలో ఆగకూడదని ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం ద్వారా విద్యార్థి విద్యార్థులుగా కుటుంబాలకు అండగా ఉంటున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మేము నార్మల్గా మల్లన్న ను కలవడానికి వచ్చాము. నా బిడ్డ చదువుకు ఇబ్బంది లేకుండా 50వేల రూపాయల చెక్కును ఇచ్చి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పాడు నేను డయాలసిస్ పేషెంట్ ప్రతిరోజు నాకు మందుల కోసం డబ్బులు అవసరం ఉంటాయి ఇంత గొప్ప నాయకుడిని మా జీవితంలో మేము చూడలేదు అని కుటుంబ సభ్యులు వాపోయారు.