A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి:
*అనుమతులు లేకుండానే టపాకాయల దుకాణాలు…
*జనావాసాల్లోనే దుకాణాల ఏర్పాటు…
*నాలుగు శాఖల అధికారుల చోద్యం….
పేర్కిట్ లో టపాకాయల దుకాణాల ఏర్పాటు వెనుక కాంగ్రెస్ నాయకుడు వత్తాసు పలకడంతోనే దర్జాగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వారి అండదండలతోనే నిర్వాహకులు జనావాసాల్లో టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేసి దర్జాగా విక్రయిస్తున్నారు. గతేడాది జనావాసాల్లో టపాకాయల దుకాణాలను పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేయడంతో అగ్నిమాపక శాఖ అధికారులు సీజ్ చేసి దడ పుట్టించారు. ఈసారి పేర్కిట్ ప్రధాన రహదారి పక్కన దుకాణాలకు ఎదురుగా వేలాదిమంది జనం సంచరించే చోట ప్రమాదకరమైన బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా సిపి జనవాసాల మధ్య టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేయవద్దని ఆదేశాలు జారీ చేసిన పెర్కిట్ లో అమలు కాకపోవడం శోచనీయం. అనుమతులు లేని టపాకాయల దుకాణాలను సీజ్ చేయాల్సిన పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.ప్రధాన రహదారి పక్కనే దుకాణాల ఏర్పాటుకు ఒక ప్రధాన కాంగ్రెస్ నాయకుడు అండ ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ నాయకుడు చెప్పడం వల్లనే అధికారులు ఈ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఏదైనా జరగరానిది జరిగితే కాంగ్రెస్ నాయకుడు, నాలుగు శాఖల అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది.