A9 న్యూస్ :
మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 41వ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ మండలలోని పల్లె (హరిపూర్) గ్రామములో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యుడు పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురకంటీ చిన్న రెడ్డి ఆధ్వర్యంలో పల్లె గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు లక్కవత్రి రాజేందర్ అలియాస్ రమ్ సన్, చేపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ లు గురువారం రోజున ఆమెవిగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించరు ఈ సందర్భంగా, ఆమె ఈ దేశాభివృద్ధికి చేసిన సేవలు, ప్రాణత్యాగాని పలువురు ఘనంగా స్మరించుకున్నారు. అనంతరం మండల అధ్యక్షుడు మాట్లాడుతూ. నేడు భౌతికంగా ఇందిరా గాంధీ లేక పోయిన ప్రజల గుండెల్లో మాత్రం ఆమె చిరస్థాయి గానిలిచిపోయారని బడుగుబలహీన, హరిజన, గిరిజన, మైనారిటీ వర్గాల వారికి ఎంతో సేవచేసిన మహనీ యురాలు ఇందిరా గాంధీ అని వారు కొనియాడారు. భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలల చాటి చెప్పిన ఇందిరా గాంధీ అని ఆమె రాజకీయ వ్యక్తిగత జీవితంలో ఎన్నోఓడుగు దొడుగులను ఎదుర్కొని శక్తివంతమైన నాయకురాలిగా భారతదేశ చరిత్రలో చిరుస్థాయిగా నిలిచిపోయిందని ఆమె అందించిన సేవలు నాటితరం నాయకులకే కాదు నెటి తరం నాయకులకు సైతం స్ఫూర్తిదాయకమని ఆదర్శవంతమని దేశ స్వాతంత్ర పోరాటంలో తండ్రి జవహార్‌లాల్ తో కలిసి ఇందిరా గాంధీ ఎంతో చురుగ్గా పాల్గొన్నారన్నారు. ప్రధానిగా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. రూపాయి మూల్యాంకణం, రాజాభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ వంటి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. హరిత విప్లవం, బ్యాంకుల జాతీ యత, ఇందిరమ్మ పథకాలు వంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో రకాల సంస్కరణల తో దేశ ప్రజలను ముందుకు నడిపిన ఉక్కు మహిల స్వర్గీయ ఇందిరాగాంధీ అని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఎల్క రంజిత్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి అది సంతోష్, కోశకధికారి కొంపల్లి భూమేష్, ఉపాధ్యక్షుడు జోరిగే ధర్మయ్య, మాజీ ఉపసర్పంచ్ కటికే శ్రీనివాస్, సర్దా గంగాధర్, దేవరాజ్, కటికే లక్ష్మణ్, శంకర్, అది శ్రీను, అరె రాజు, సుంకపాక రవి, చిన్న గంగాధర్, శ్రవణ్, నర్సింగ్, లింబద్రి గౌడ్, దుబ్బాక సాయన్న, కొంపల్లి సుధాకర్, సోక్కం సంజీవ్, కె రమేష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.