ఇబ్రహీంపట్నం భూమేశ్వర్ s/o గంగారం. వయసు 36 సంవత్సరాలు, గ్రామం కోనసముందర్, మండలం కమ్మర్ పల్లి, జిల్లా నిజామాబాద్. ఇతను గత 20 నెలలుగా కువైట్ లోని ప్రముఖ కంపెనీలో పనిచేస్తూ రోజు మాదిరిలాగానే కంపెనీలో పని ముగించుకొని వచ్చి రూములో నిద్రిస్తుండగా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కావడం జరిగింది. తోటి మిత్రులు గమనించి వెంటనే కంపెనీ యాజమాన్య సహకారంతో దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స జరుగుతుండగా తీవ్ర అనారోగ్య కారణంగా ఈ నెల 18/10/2024 నాడు మరణించాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఎలాగైనా మృతుని పార్థివదేహాన్ని ఇంటికి తెప్పించాలని కుటుంబ సభ్యులు కోరడంతో మృతుని సమీప బంధువు కువైట్ లోని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక (GWAC) అధ్యక్షుడైన మగ్గిడి ఆనంద్ కుమార్ గారికి విన్నవించడం జరిగింది.
ఆనంద్ కుమార్ గారు అక్కడి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ఇండియన్ ఎంబసీ ద్వారా కావలసిన పేపర్ వర్క్ త్వరితగతిన ముగించి ఈరోజు అనగా 21/10/2024 నాడు భూమేశ్వర్ యొక్క పార్థివ దేహాన్ని కువైట్ విమానాశ్రయం నుండి పంపించడం జరిగింది. మృతుని యొక్క పార్థివ దేహం హైదరాబాద్ విమానాశ్రయానికి రేపు అనగా 22/10/2024 తెల్లవారుజామున 3:30 నిమిషాలకు చేరుకుంటుంది.
భూమేశ్వర్ యొక్క పార్థివ దేహం హైదరాబాద్ విమానాశ్రయం నుండి అతని స్వగ్రామం కోనసముందర్ తరలించడానికి ఉచిత అంబులెన్స్ సదుపాయం కల్పించాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక(GWAC) అధ్యక్షులు ఆనంద్ కుమార్ గారు తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ సెల్ అధికారి శ్రీ చిట్టిబాబు గారిని అభ్యర్థించడం జరిగింది. మృతుడు భూమేశ్వర్ యొక్క అంత్యక్రియలు రేపు ఉదయం అతని స్వగ్రామం కోనసముందర్ లో జరుపబడును.
మృతుడు భూమేశ్వర్ యొక్క పార్థివ దేహాన్ని త్వరితగతిన స్వదేశానికి రప్పించడానికి సహాయ సహకారాలు అందించిన కంపెనీ యాజమాన్యానికి మరియు మృతుని సమీప బంధువు తోపారం శ్రీనివాస్ గారికి గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక అధ్యక్షులు ఆనంద్ కుమార్ గారు ధన్యవాదాలు తెలిపారు మరియు మృతుని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని అభ్యర్థించారు..