A9 న్యూస్ , ఆర్మూర్

 

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ కోరుతూ దళిత హక్కుల పోరాట సమితి ఆర్మూర్ డివిజన్ కన్వీనర్ మాదరి నరేష్ అన్నారు మంగళవారం రోజు ఆర్మూర్ పట్టణంలో డి హెచ్ పి ఎస్ కార్యాలయం లో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ నియంత పాలనకూ వ్యతిరేకంగా తెలంగాణా ప్రజలు ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ కీ ఓట్లు వేసి గెలిపించుకున్నారని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా హడ్రా అంటూ అమాయకపు ప్రజలను రోడ్డు పాలు చేయడం ఎంతవరకు న్యాయమని.తెలంగాణా రాష్ట్రంలో పాలనా గాడితప్పిందని తక్షణమే ప్రజలకు డబులు బెడ్ రూమ్. వంట గ్యాస్ సబ్సిడీ.గృహ లక్ష్మి.ఆడపిల్ల వివాహానికి తులం బంగారం. కొత్త రేషన్ కార్డు డిజిటల్ కార్డు అంటూ ఇతరత్ర ఆరు గ్యారంటీ లు ఇప్పటి అమలుకు నోచుకోవడం లేదని తక్షణమే ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చకుంటే ప్రజా అగ్రహానికి గురికాక తప్పదని అయన అన్నారు. ఈ కార్యక్రమం లో బుజ్జి. మంగ. అరవింద్.రాము. తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *