ఎం ఎల్ సి ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలు:

 

A9 న్యూస్,ఆర్మూర్ :

 

ఆర్మూర్ న్యాయవాద బార్ అసోసియేషన్ మాజీ సంయుక్త కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో , న్యాయవాద బార్ అసోసియేషన్ అధ్యక్షులు తెడ్డు నర్సయ్య అధ్యక్షతన ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలను ఆర్మూర్ బార్ అసోసియేషన్ నందు ఇవ్వడమైనది.

ఈ సందర్భంగా ఆర్మూర్ న్యాయవాద బార్ అసోసియేషన్ అధ్యక్షులు తెడ్డు నర్సయ్య మరియు సీనియర్ న్యాయవాది లోక భూపతి రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదును ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ చేయించుకోవాలని. ప్రధానంగా న్యాయవాదులు అందరూ కూడా ఓటర్ నమోదు చేయించుకొని ఎన్నికలలో ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించి అందరికీ ఆదర్శంగా నిలవవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేయడమైనది.

ఈ యొక్క కార్యక్రమంలో ఆర్మూర్ న్యాయవాద బార్ అసోసియేషన్ కార్యదర్శి అరుణ్ కుమార్, న్యాయవాదులు చిలుక కిష్టన్న, పోచన్న, అమితాబ్ కిరాడ్, ఆవుల అశోక్, జిజి రామ్, అవారి రమేష్, సంగీత ఖాందేశ్, ఏర్గట్ల గణేష్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *