A9NEWS:
ఇటీవలే గరుడ ఏరో స్పెస్ ప్రయివేట్ లిమిటెడ్ వారితో ఎం వో యు కుదుర్చుకున్న క్షత్రియ కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ విద్యాసంస్థ ఈనెల 14 అక్టోబర్ నుండి 18 అక్టోబర్ వరకు చెన్నై లోని గరుడా ఏరో స్పెస్ లో జరిగిన ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రాం కు హాజరు కావడం జరిగింది, ఈ ట్రైనింగ్ కార్యక్రమం లో పాల్గొన్న లింగంపల్లి శివప్రసాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ECE Dept., అలాగే అల్గొట్ దేవరాజు లెక్చరర్ EEE dept. మాట్లాడుతూ అగ్రి డ్రోన్ ప్రాముఖ్యతను, రైతులకు జరిగే మేలును గురించి అలాగే డ్రోన్ ఫైలెట్ శిక్షణ విధానం, సిమ్ములేషన్, అసెంబ్లింగ్, డ్రోన్ ఆపరేటింగ్ విధానం, అన్ని కూడా క్షుణ్ణంగా ఈ శిక్షణ లో తెలుసుకోగలిగామని, ఇది కేవలం రైతులకే కాకుండా నిరుద్యోగులకు ఒక జీవనదారం గా ఎలా ఉపయోగ పడుతుందో దానికి కావసిన అన్ని రకాల శిక్షణ లు తెలుసుకోగలిగామని చెప్పారు, ఐదు రోజుల ఈ శిక్షణ కార్యక్రమం ను విజయవంతం గా పూర్తి చేసుకున్నందుకు గాను కళాశాలా ప్రిన్సిపాల్ ఆర్ కె పాండే గారు, సెక్రెటరీ అల్జపూర్ దేవేందర్ గారు, మేనేజ్మెంట్ అలాగే ఇతర సిబ్బంది అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.