A9 న్యూస్ నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఉన్న జీవన్ మాల్ కోసం తీసుకున్న అప్పులకు షూరిటీ ఉన్న వ్యక్తులకు నోటీసులు జారీ అయినట్లు తెలిసింది. ఈ యేడాది సంబంధిత మాల్ కు సంబంధించిన అద్దె కోసం ఆర్టీసీ నోటీసులు ఇచ్చి జప్తు చేసిన విషయం తెలిసిందే. అద్దె బకాయిలను చెల్లించి కోర్టు ద్వారా రిలీఫ్ పొందిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ షాక్ ఇచ్చింది. విష్ణు జిత్ డెవలప్మెంట్ ఇన్ ఫ్రా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి షూరిటీ ఇచ్చిన వ్యక్తుల భూముల స్వాధీనానికి నోటీసులు అతికించారు. ఆర్మూర్ లోని కొత్త బస్టాండ్ వద్ద జీవన్ రెడ్డి మాల్ నిర్మాణం కోసం ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ద్వారా విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలప్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రూ. 45 కోట్ల 46 లక్షల 90 వేలు వడ్డీతో సహా అసలు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. దీనికి షూరిటీ ఇచ్చిన కాట్ పల్లి గంగారెడ్డి, యల్ల నరేందర్, నక్కల లక్ష్మణ్, తమ భూములను కార్పొరేషన్ కు షూరిటి కింద తనాక పెట్టారు. సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో భూములు స్వాధీనం చేసుకుంటామని కోరుకుంటూ వ్యవసాయ భూముల వద్ద ప్లే కార్డులు పెట్టి కార్పొరేషన్ అధికారులు నోటీసులను అతికించారు. షూరిటీ ఇచ్చిన వ్యక్తుల భూములు స్వాధీనం కోసం అధికారులు రంగంలోకి దిగారు. వారి భూముల వద్ద బకాయి ఉన్న డబ్బుతో పాటు షూరిటీ ఇచ్చిన వ్యక్తుల పేర్లను వారి భూముల వివరాలను పేర్కొంటూ తాము వీటిని డబ్బులు చెల్లించినట్లయితే స్వాధీనం చేసుకుంటున్నామని నోటీసులు అతికించారు. షూరిటీ ఇచ్చిన పలువురి భూముల వద్ద ప్లే కార్డులు పెట్టి నోటీసులు అతికించడం ఆర్మూర్లో సంచలనం రేకెత్తించింది.