మా కూతురు రక్షిత మృతి పై విచారణ జరిపి, మాకు న్యాయం చేయలి..!
రక్షిత తండ్రి జిల్లా కలెక్టర్ కి వినతి
వ్యవసాయ పాలిటెక్నిక్ లో మొదటి సంవత్సరం చదువుతున్న మా కూతురు రక్షిత మృతిపై సమగ్ర విచారణ జరపాలని రక్షిత తండ్రి విష్ణు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ని కోరారు.
ఈ రక్షిత కు న్యాయం చేయాలని పిడిఎస్యు, యు.ఎస్.ఎఫ్.ఐ, పి.వై.ఎల్ దర్మాసమాజ్ పార్టీ లతో కలిసి రక్షిత తండ్రి విష్ణు జిల్లా కలెక్టర్ కి నిజామాబాద్ నగరంలో కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న నా కూతురు రక్షిత మూడు రోజుల క్రితమే హాస్టల్ లో జాయిన్ చేశానని,
శనివారం రోజున ఉదయం హాస్టల్ లో చనిపోయిందని, కళాశాల ప్రిన్సిపల్ మేము వచ్చేదాకా అపకుండా బోధన్ ఆసుపత్రికి తరలించరని, హాస్టల్లో సీసీ కెమెరాలు చూపించలేదని, మా కూతురు ఆత్మహత్య
పలు అనుమానాలకు దారితీసిందని, మరియు విద్యార్థులకు పాఠాలు చెప్పే అనేకమంది మహిళా లెక్చరర్స్ ఉండగా పురుషులనే ఎందుకు వార్డెన్ గా నియమించారని, లోపల ఏం జరిగిందో విషయాలను బయట చెప్పకుండా మొదటి సంవత్సరం విద్యార్థులను అదే రోజు ఇంటికి పంపించడం మరిన్ని అనుమానాలకు దారితీసిందని, కావున విద్యార్థి మృతి పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మా కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, యు.ఎస్.ఎఫ్.ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది సూరి, దర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ మహారాజ్, మరియు విద్యార్ధి సంఘల నాయకులు కార్తీక్, ప్రిన్స్,మహేష్, దేవిక, ప్రేమ్, మహేష్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.