- A9 న్యూస్ ఆర్మూర్:
అనే నినాదముతో వినాయక చవితి పండుగ సందర్బంగా శనివారం రక్షా స్వచ్చంధ సేవా సంస్థ ఆర్మూర్ వారి ఆధ్వర్యములో ఆర్మూర్ పట్టణములోని జిరాయత్ నగరులో ప్రతి ఒక్కరు మట్టి గణపతులను పూజించాలని కోరుతూ ఉచితంగా మట్టి గణపతుల విగ్రహాలను పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఖాందేష్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్లాస్టర్ అఫ్ ప్యాలస్ (పి ఓ పి) వల్ల పర్యావరణానికి ఎంతో ముప్పు వుందని తెలియచేస్తూ, ప్రజలకు పర్యావరణ పరిస్థితుల గురించి అవగాహన కల్పించారు. స్వచ్చంధ సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందమ్ నరహరి మాట్లాడుతూ గత పన్నెండు సం,, లుగా మా సంస్థ తరపున మట్టి గణపతులను ఉచితంగా పంపిణి చేస్తున్నామన్నారు. గతములో పర్యావరణం గురించి అవగాహన ర్యాలీలు కూడా నిర్వహించామన్నారు, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఖాందేష్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన. ఈ కార్యక్రమానికి సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ ప్రాజెక్ట్ చైర్మన్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు జిందo నరహరి విద్యా గోపి, కోశాధికారి గోనె శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్సులు డా|| బేతు గంగాధర్, తులసి పట్వారి, ఖాందేష్ సత్యం, శ్రావణ్ సభ్యులు నరేష్, శ్రీను రాజేష్, రాజ శేఖర్, సాయినాథ్, వినోద్, రమేష్, రాకేష్, లింగం, రఘు, తదితరులు పాల్గొన్నారు.