A9 న్యూస్ కామారెడ్డి బ్యూరో:
బాన్సువాడ పట్టణం లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రి లో నర్సు గా పని చేస్తున్న మమతను హత్య కేసును పోలీసులు చేదించారు. ప్రేమించిన ప్రియుడే మమతను హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించారు. ఈ విషయంలో పోలీసులు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. నిరుడి ప్రశాంత్ నీ విచారణ చేయగా హత్య చేసిన విషయం బయటకు వచ్చింది, కూతురు ఆత్మహత్య కు నిరుడి ప్రశాంత్ కారణమని కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. మమత ప్రశాంత్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి విషయంలో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి, మమత తల్లి ఐదు రోజులు సెలవు పెట్టి రమ్మని ఒత్తిడి చేస్తుందని చెప్పడంతో , ప్రశాంత్ తన తల్లి తో ప్రేమ విషయం వివరించాడు. మన కంటే వారిది ఎక్కువ కులం కావడంతో పెళ్లి విషయాన్ని ప్రశాంత్ తల్లి తిరస్కరించింది. చెల్లి పెళ్లి చేశాక మన పెళ్లి విషయం తల్లి ని ఒప్పించి చేసుకుంటా…ఇప్పుడు కుదరదు అని మమత కు ప్రశాంత్ చెప్పడంతో ,మీ అమ్మ పెళ్లికి ఒప్పుకోదు పెళ్లి చేసుకుందాం అని మమత మరింత ఒత్తిడి చేసింది. మమత నుండి ఎలాగైనా తప్పించుకోవాలని, ఆగస్ట్ నెలలో 30వ తేదీన అద్దె కు ఇంట్లో ఉన్న ఇంటికి వెనుక డోర్ నుండి వెళ్లి చున్నీ తో ఉరివేసి హత్య ప్రశాంత్ హత్య చేశాడు. ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది అని స్నేహితుని కి కాల్ చేసి డాక్టర్ నీ తీసుక రమ్మని చెప్పడంతో. బయట తిరిగి వచ్చిన స్నేహితుడు ఎవడు రావడం లేదు అని చెప్పాడు ఇద్దరు కలిసి మమత ను బయటకు తీసుక వస్తున్న సమయంలో ఇంటి యజమాని ఏమైంది అని అడగగా సొమ్మా సిల్లీ పడిపోయింది, ఆసుపత్రి కి తీసుకొని వెళ్తున్నామని చెప్పడం తో ముగ్గురు కలిసి ఆసుపత్రి కి తీసుకొని వెళ్లారు. అప్పటికే మృతి చెందింది అని వైద్యులు నిర్ధారించారు. మమత బందువులకు ఫోన్ చేసి ఊరి వేసుకొని ఉంది అని చెప్పి ప్రశాంత్ అక్కడి నుంచి పారిపోయాడు. ప్రశాంత్ పై హత్య కేసు నమోదు చేసి రిమాండ్ పంపినట్లు బాన్సువాడ సిఐ కృష్ణ వెల్లడించారు.